![]() |
![]() |
.webp)
క్యాష్ ప్రోగ్రాం ప్రతీ వారం మస్త్ కామెడీ పండిస్తూ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది. మూవీ ప్రొమోషన్స్ కి సంబంధించిన నటీనటులు ఎక్కువగా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెరైటీ గా ప్లాన్ చేశారు. క్యాష్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.. ఈ షోకి సీరియల్స్ అత్తాకోడళ్లు ఎంట్రీ ఇచ్చారు. హరిత - సుహాసిని, శిరీష - గౌతమీ, భావన - వర్షిణి, కస్తూరి - లహరి..ఇక సుమ కామెడీ మాములుగా లేదు.. " ఒకప్పుడు అత్తలంటే ఎలా ఉండేవారు..ఎంతో పద్ధతిగా ఉండేవారు" అని ఈ సీరియల్ అత్తల మీద కౌంటర్ వేసింది.
ఇక కోడళ్ళకు ఒక టాస్క్ కూడా ఇచ్చి ఎంటర్టైన్ చేసింది సుమ. టైం లిమిట్ పెట్టి కోడళ్లంతా వచ్చి వాళ్ళ వాళ్ళ అత్తగార్లని ఎత్తుకోవాలని చెప్పింది. "అత్తాకోడళ్లకు ఎక్కువగా కిచెన్ లోనే ఎందుకు గొడవలు వస్తాయి" అని అడిగింది సుమ. సుహాసిని వాళ్ళ రియల్ అత్తగారు చూస్తూ ఉంటారు ఆవిడ అక్కడి నుంచి ఇలా చెప్తారు " మంచినీళ్ళని మైక్రోవేవ్ లో వేడి చేసి ఇది వంట అంటుంది" అని సుమ కామెడీ చేసింది. ఇక అత్తలు, కోడళ్ళకు చపాతి చేసే టాస్క్ ఇచ్చింది. ఇంకా ఒక కూరగాయ పేరు చెప్పి దాంతో పాటలు కూడా పాడించింది. అత్తాకోడళ్లలో ఒక టీం ఐన భావన - వర్షిణి కలిసి దొండకాయ, బెండకాయ మీద సాంగ్స్ పాడి సుమకి షాకిచ్చారు. ఇక ఫైనల్ గా కార్తీక మాసం కాబట్టి అందరూ కలిసి వన భోజనాల్లాంటివి కాష్ షో భోజనాలు చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు.
![]() |
![]() |